ఏడు నెలలుగా బడ్జెట్ ఇవ్వక ఇబ్బందులు
బిల్లులపై ఉన్న ఫ్రీజింగ్ ఎత్తివేయాలి
బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బ్జడెట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని హాస్టళ్ళను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే బ్జడెట్ విడుదల చేయాలనీ, ట్రెజరీతో బిల్లులపై ఉన్న ఫ్రీజింగ్ ఎత్తివేయాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆర్ధిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రామకృష్ణను కలిసి చర్చలు జరిపారు. బ్జడెట్ విడుదల చేయకపోవడంతో హాస్టళ్ళ నిర్వాహణ చాల ఇబ్బందిగా తయారైంది. మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 750 బి.సి హాస్టళ్ళు, దాదాపు 1200 హాస్టళ్ళ మెస్ బిల్లులు, కరెంట్ బిల్లులు, అ/-దదెలు, కాస్మోటిక్ చార్జీలు, ఇతర చార్జీల గత 7 నెలల నుండి విడుదల చేయడంలేదు. జూలై నెల బ్జడెట్ విడుదల చేసిన ఫ్రీజింగ్ మూలంగా ఒక నెల బిల్లులు పాస్ కావడం లేదు. హాస్టల్ వార్డెన్లు వడ్డిలకు అప్పులు తెచ్చి హాస్టళ్ళు నడిపిస్తున్నారు. లక్షల రూ. ఆప్పులు పెరుగడం మూలంగా హాస్టళ్ళు నడుపడం కష్టంగా మారింది. వెంటనే బ్జడెట్ విడుదల చేయకపోతే హాస్టళ్ళు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. హాస్టల్స్ నందు జూలై 2018 నుండి హాస్టల్స్‌కి బ్జడెట్ ఇవ్వలేదు. న్ని హాస్టల్స్ కు ఒక నెల జూలై నెల బ్జడెట్ ఇచ్చినా ట్రెజరరీ ఫ్రీజింగ్ వలన ఆగిపోయింది.బిల్లులు చెల్లించని కారణంగా వ్యాపారస్థులు హాస్టల్స్‌కి సరుకులు ఇవ్వటానికి నిరాకరి స్తున్నారు. చేసిన బకాయిలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు.హాస్టల్ నిర్వహణకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అప్పులు తెచ్చి, వాటికి వడ్డి కట్టలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు భవనాలలో ఉన్న హాస్టళ్ళ అ/-దదె బ్జడెట్ కుడా రావటంలేదు. లక్షల రూ. బకాయిలు ఉన్నాయి. ఇంటి యజమానులు వేధిస్తున్నారు. కాలేజి హాస్టల్స్ లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వర్కర్స్ లేరు. దీని మూలంగా విద్యార్థులకు సకాలంలో భోజనాలు ఏర్పాటు కావడంలేదు. 200 మంది ఉన్న ముగ్గురు వర్కర్లు మాత్రమే ఉన్నారు. హాస్టళ్ళ కరెంటు బిల్లుల బకాయిలు గత 12 నెలలుగా చెల్లించడం లేదు. కోట్ల రూ. బకాయిలు పేరుక పోయినవి. విద్యుత్ శాఖ అధికారులు పదే,పదే హాస్టళ్లకు కరెంట్ కట్ చేస్తున్నారు. ఒక వైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కరెంట్ కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారు. ఒక రోజు కరెంట్ లేకపోతే విద్యార్థులకు పంపులు నడువక వాటర్ సప్లై లేక భోజనాలు పె/-టటె పరిస్థితి ఉండదు. హాస్టల్ విద్యార్థులకు గత 6 నెలల నుంచి కాస్మోటిక్ చార్జీలు చెల్లించడం లేదు. సబ్బు, నూనెల పైసలు చెల్లించక పోవడంతో విద్యార్థులు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కృష్ణయ్య కోరారు. ఇకపోతే గత 10 నెలల నుండి ట్యూటర్ బిల్లుకు బ్జడెట్ విడుదల మంజూరు చేయాడం లేదు. విద్యార్థులకు ఇచ్చినట్లు విద్యార్థులకు కుడా మంచాలు మంజూరు చేయడంలేదు. భవన మరమ్మత్తులు, సున్నం వేయడానికి నిధులు ఇవ్వడం లేదు. 10వ తరగతి విద్యార్థులకు నోటు బుక్కులు, గా బి.సి విద్యార్థులకు 28 నోటు పుస్తకాలు మంజూరు చేయాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 69 పాటశాల బి.సి హాస్టళ్ళను విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో మూసివేశారు. పాఠశాల హాస్టళ్ళలో సంఖ్య లేకపోతే కాలేజి హాస్టళ్ళు గా మార్చాలని ప్రభుత్వం జారి చేసింది. అయితే హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాద్ మూడు జిల్లాలలో కొన్ని కాలేజి హాస్టళ్ళు ప్రారంబించారు. కాని మిగతా జిల్లాలలో ఇంత వరకు కాలేజి హాస్టళ్ళుగా మర్పుచేయలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంఖ్య లేని పాటశాల హాస్టళ్ళను కాలేజి హాస్టళ్ళుగా మార్చాలని, ఇందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వెంటనే బ్జడెట్ విడుదల చేసి ఇతర సమస్యలు పరిష్కరించి హాస్టళ్ళు సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో హాస్టళ్ళు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అధికారిని కలసిన ప్రతినిధి వర్గంలో గుజ్జ కృష్ణ, రాజేందర్, కృష్ణుడు, జైపాల్ ముదిరాజ్, ఉ.అంజి, ఐ.కృష్ణుడు, ఐ.నరసింహ గౌడ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, ఓంప్రకాష్ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




