అనంతగిరి హిల్స్ కాలనీలో విద్యుత్ ఏర్పాటుకై నిధులు కేటాయించాలని చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కి వినతి పత్రం ఇచ్చిన వికారాబాద్ జర్నలిస్టులు..


వికారాబాద్ రూరల్ ఆగస్టు 4 జనం సాక్షి
సమాజంలో తలెత్తుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా వార్త కథనాలు అందిస్తూ ఫోర్త్ పిల్లర్ గా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఎప్పుడూ ముందుంటామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్అన్నారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అనంతగిరి హిల్స్ కాలనీలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.7.65 లక్షల నిధులు కేటాయించాలని కోరుతూ చైర్ పర్సన్ కి వికారాబాద్ జర్నలిస్టులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన చైర్ పర్సన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఎప్పుడు ముందుంటామని, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, మా కౌన్సిలర్లు, కౌన్సిల్ సభ్యులు అందరి సహకారంతో అనంతగిరి హిల్స్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, నాయకులు రెడ్యానాయక్, కాంట్రాక్టర్ ప్రవీణ్, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, గోపాల్, రాఘవేందర్, చుక్కయ్య, మహేందర్, రవి, వైద్యనాథ్, మహేష్, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు