అనారోగ్యంతో అధైర్య పడవద్దు
కెసిఆర్ ప్రభుత్వం ఆదుకుంటుంది
— టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్
టేకులపల్లి, అక్టోబర్ 17( జనం సాక్షి): ఏ ఆదరువు లేదని ఎవరు కుంగిపోవద్దని, అనారోగ్యంతో ఎవరు కూడా ధైర్యపడవద్దని కెసిఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని టిఆర్ఎస్ టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్ అన్నారు. సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ క్యాంపు కార్యాలయంలో టేకులపల్లి మండలం లోని తడికలపూడి గ్రామపంచాయతీ పరిధిలో గల తావుర్యతండా గ్రామానికి చెందిన బి.లాల్ సింగ్ s/o ఛత్రియ అనారోగ్యం పాలవడంతో స్పందించిన ఎమ్మెల్యే వైద్యశాల ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ (ఎల్ ఓసి) ద్వారా ఒక లక్ష రూపాయలను మంజూరు చేయించారు. ఈ మేరకు లక్ష రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు పార్టీ ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్, ఎంపీటీసీ జాలాది అప్పారావు, టిఆర్ఎస్ నాయకులు బానోతు రామా నాయక్ చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలంక గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా రతన్ లాల్, మండల నాయకులు మాలోత్ భీముడు తదితరులు పాల్గొన్నారు.