అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 16
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ ప్రాంతంలో రమణారెడ్డి జన్ ఔషధీ కేంద్రాల నిర్వహకులు ఓపెన్ స్వచ్ఛంద సిసంస్థ అధ్యక్షులు జిఎన్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్ మరియు మెడి విజన్ ఐ హాస్పిటల్ జనప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు చేతుల మీదేగా మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపులో బీపీ షుగర్ చెక్ అప్ చేసి కంటి పరీక్షలు చేయడం జరిగింది. అనంతరము ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వైద్య శిబిరాలు పెట్టడం ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జన ఔషధ కేంద్రాల గురించి వివరించటం దాదాపు 50 నుండి 90 శాతం అతి తక్కువ ధరలకు లభిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దేశంలో దాదాపు తొమ్మిది వేల షాపులు ఉన్నప్పటికీ మల్కాజిగిరి నియోజకవర్గం లో గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో 25 కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్క నియోజకవర్గంలోని 10 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అతి తక్కువ ధరలకే అందిస్తున్న అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఒకరి ద్వారా ఒకరికి తెలియజేస్తూ ఈ స్కీము యొక్క ఉపయోగాన్ని వినియోగించుకోవాలని మురళీధర్ రావు కోరారు. ఈ క్యాంపులో దాదాపు 400 మందికి వైద్య పరీక్షలు చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సత్యనారాయణ బాబు కరుణశ్రీ , హౌ దిస్ మిశ్రా, ఠాకూర్, డీకే సింగ్ , జనప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణారావు, శ్రీనివాసరావు, ప్రకాష్ చౌదరి, కౌశిక్ యాదవ్, ఉదయ్, ప్రకాష్, నాగరాజ్, వినోద్, కృష్ణ చారి, మల్లేష్ గౌడ్, రాజిరెడ్డి, అనురాధ, నికేష్, తదితరులు పాల్గొన్నారు.
జన్ ఔషధ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి




