అనుమతుల మంజూరిని త్వరితగతిన ఇవ్వాలి…
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి , ఆగస్ట్ 29.
పరిశ్రమల స్థాపనలో అనుమతుల మంజూరిని త్వరితగతిన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయం లో తన చాంబర్ లొ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ టీ- ప్రైడ్ పథకం కింద ఎస్.సి.లు ముగ్గురికి మైక్రో యూనిట్ లకు పావలా వడ్డీ మంజూరు కి కమిటీ ఆమోదం తెలిపింది.
టి-ప్రైడ్ పధకం క్రింద
ఎస్సీ లు 26 ఎస్టీలు 56, దివ్యంగులు ఒకరికి. దరఖాస్తులకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మాజురుకు కమిటీ సిఫారసు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జి.యం. కొటేశ్వర రావు, పరిశ్రమల అనుమతుల కు సంబంధించిన వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.