|
ఈ రాత్రిని మరిపించే వెన్నెల కురుస్తూ ఉన్న సన్నివేశంలో అరణ్యాల శిఖలపై పూల తెమ్మరలపై
గాలి అలా అలా వ్యాపించి చిరునవ్వుల చిత్రాలను చెవులలో వినిపిస్తుంది వాటి సన్నని గుసగుసలు
రేపటికి నిన్ను ఆనందపు జడిలో ముంచెత్తాలని చూసి ఈ వెన్నెల కురిసే మల్లెల రాత్రి
రాత్రికి కొద్దిమంది వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య తెల్లవారే వరకు ఒక కొత్త సంఘటనలకు మూలమవుతున్న సందర్భంగా
సామాన్యుని కోసం గొంతెత్తిన కొద్దిమంది
పిడికిలి ఎత్తి
శ్రామిక జన సౌందర్య అరణ్యాలను చిత్రించాలని
జనారంయాల్లోని దౌర్జన్య దోపిడీలను ఆకాంక్షల స్వార్థాలను బద్దలు కొట్టాలని ఎత్తిన ఘోష ప్రతిధ్వనిస్తున్నది మారుమూల కొండకోనలు
ప్రతి రాత్రి ఓ కొత్త ఆవిష్కరణకు వ్యూహం ఆలోచన పదం అంతులేని 100 మంది రేపటికి ఓ కొత్త నవోదయాన్ని కొత్త ఉషోదయం కొత్త అరుణోదయాన్ని తూర్పు శిఖరం పై ఉదయించే సూర్యుని అడ్డుకోలేనితనాన్ని
ప్రతిష్టించాలని నిరంతరం తపిస్తూ…..
జాతికి కొత్త మెరుపులు కొత్త తలుపుల గాధల్ని అందించాలని
ప్రగతి యానంలో సాగిపోతున్న కాలానికి స్వాగతం…..
ఇది కొత్త వెలుగుల జీవనానికి ఆనంద కెరటమై సాగిపోతూనే ఉంది……
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి కోట 7702537453
|




