అన్నదాతకు. అధికారులు అందుబాటులో ఉండాలి..
జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి..
పెద్ద శంకరంపేట. జనం సాక్షి అక్టోబర్ 18
మండల పరిధిలోని టేంకటి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారిని శ్యామకుమారి పంటలను పరిశీలించడం జరిగినది.. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పత్తి రైతులు క్రిమిసంహారక మందులను వాడటంలో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలి అన్నారు.. రైతులకు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారన్నారు..
ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించడం వలన ఎలాంటి రసాయన మందులు వాడాలో తెలుస్తుంది. అధికారుల. సూచన మేరకే క్రిమిసంహార మందులు వాడాలన్నారు.. ఈమె వెంట ఏవో రాజేష్ కుమార్, ఏఈఓ స్వాతి, భవాని, రైతులు ఉన్నారు….