Thursday, 5 November 2026

అన్నదాతలను అవమానిస్తారా?

– రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
– బీజేపీపై తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఫైర్‌
హైదరాబాద్‌, మే12(జ‌నం సాక్షి ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని విపక్షాలు హేళన చేయడం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హితవు పలికారు. రైతు బంధు డబ్బులతో మద్యం తాగుతున్నారంటూ బీజేపీ నేతలు అన్నదాతలను అవమానించారని మండిపడ్డారు. రైతులకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏవిూ చేయలేదని ఆరోపించారు. కానీ సాయం చేస్తున్న వారిని మాత్రం విమర్శిస్తారా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలని కర్నె ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూలేని సంతోషంగా రైతులు ఉన్నారని, కేసీఆర్‌ పాలనలో రైతులకు పెద్దపీట వేయటంతో పాటు వారికి కావాల్సిన విధంగా అండగా ఉంటున్నామన్నారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్‌ ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, దీనిలో భాగంగా సమన్వయ సమితులు ఏర్పాటుతోపాటు, సాగు ప్రారంభంలో రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా రైతులకు అండగా నిలిచేందుకు ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. దీనిని బీజేపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. దేశంలో విూరు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఎక్కడైనా పెట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను చూసి విూ పార్టీ జాతీయ నేతలు ప్రశంసిస్తున్నారని, కానీ ఇక్కడ నేతలు రైతులకు సహాయం చేస్తే పాపం అన్నట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలుచెప్పాలని, లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు.