అన్నదానం మహదానం

– వాసవి క్లబ్ అధ్యక్షుడు మీలా వాసుదేవ్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):అన్నదానం చేసి ధన్యజీవులు కావాలని సూర్యాపేట వాసవిక్లబ్ అధ్యక్షుడు మీలా వాసుదేవ్ అన్నారు.అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.అన్నదానం మహాదానమని పేర్కొన్నారు.వేసవి తాపాన్ని తీర్చడానికి మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలతో పాటు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ప్రతి అమావాస్య రోజున సుమారు 500 మందికి తమ క్లబ్ తరుపున భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.కరోనా కష్టకాలంలో ఇంటికే పరిమితమైన ఎంతోమందికి అల్పాహారంతో పాటు మూడు పూటలా భోజనం వసతి ఏర్పాటు చేసిన ఘనత తమ క్లబ్ కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ బిక్కుమల్ల కృష్ణ , జోన్ చైర్మన్ కలకోట లక్ష్మయ్య , బెలిదే శ్రీనివాసులు, ముప్పారపు భానుప్రసాద్, చల్లా లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.