అన్నదానం.. మహాదానం : ఆర్యవైశ్య సంఘం సభ్యులు

అన్నదానం.. మహాదానం : ఆర్యవైశ్య సంఘం సభ్యులు

దౌల్తాబాద్ సెప్టెంబర్ 27,జనం సాక్షి.

వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన వినాయకుడి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు,వివిధ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు గంప రవి, మాశెట్టి నరేష్, జిల్లా శ్రీనివాస్, పబ్బ ప్రభాకర్, అశోక్,హరికిషన్, శ్రీరాం చంద్రం,మురుకి శ్రీనివాస్, అయిత చంద్ర శేఖర్, అంజయ్య,శ్రావణ్,శ్రీధర్, విశ్వనాధం,తదితరులు పాల్గొన్నారు.