Thursday, 5 November 2026

అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న : మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్

ఎల్బీ నగర్  (జనం సాక్షి )  నస్థలిపురంలోని శ్రీ జయ దుర్గాదేవి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు  బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో  పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ పద్మకుమారి,మహిళ కమిటీ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.