ఏవియేషన్ మేనేజింగ్ కమిటీ భేటీలో సిఎస్
హైదరాబాద్,జూలై12(జనం సాక్షి): రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏయిర్ కనెక్టివిటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నెలరోజుల్లోగా ఏవియేషన్ ఇన్ ఫ్రాస్టక్చర్ర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ముసాయిదా నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమి మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఏవియేషన్ అకాడవిూ సెక్రెటరీ కెప్టెన్ ఎస్. ఎన్. రెడ్డి లతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఏయిర్ స్క్రిప్ట్ లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇన్ ఫ్రాస్టక్చ్రర్ను వినియోగించుకోవడం తో పాటు భవిష్యత్తులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలన్నారు. ఏవియేషన్ అకాడవిూ వివిధ విమానయాన సంస్థలకు శిక్షణనిచ్చే స్వయంసమృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. ఏవియేషన్ అకాడవిూ ద్వారా ఓ/ూఅ 5 సంవత్సరాల ఏవియేషన్ కోర్సు ద్వారా వంద శాతం ఉద్యోగాలు పొందు తున్నారని, ంఓఇ కోర్సు ద్వారా మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలుపుతూ విమానయాన రంగంలో విదేశాలలోను తెలంగాణ యువత మరిన్ని ఉద్యోగాలు పొందేలా కొత్త కోర్సులను ప్రారంభించాలన్నారు. అకాడవిూ ద్వారా ్గ/ల్గ/లెట్ ట్రైనింగ్ శిక్షణ పొందిన వారిలో 75 నుండి 80 శాతం ఉద్యోగాలు పొందు తున్నారని శిక్షణలో తెలంగాణ ఏవియేషన్ అకాడవిూ దేశంలో మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్ క్యాడర్ పైలెట్ ట్రైనింగ్ కోసం ఏవియేషన్ అకాడవిూ తో ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు వివరించారు. ఆచరణాత్మక జ్ఞానం కోసం ఏయిర్ ఇండియాతోను ఒప్పందం చేసుకున్నా మన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్ రంగంలో వచ్చే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అకాడవిూ తగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.




