అన్ని పత్రాలున్నా మాపై దౌర్జన్యం చేస్తున్నారు.

జిపిఏ హోల్డర్ ఆబేద్ హుస్సేన్.
తాండూరు ఆగస్ట్ 24 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని చెంగొల్ గ్రామం సర్వేనెంబర్ 147/ఈఈ లొ 242 గజాల స్థలం సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తమపై గౌతపూర్ చెందిన ఎంపీటీసీ సాయి రెడ్డి సైదయ్య అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని స్థలం జిపిఎ హోల్డర్ మహమ్మద్ ఆబేద్ హుస్సేన్ ఆరోపించారు. తమస్తలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అనుచరులతో కలిసివచ్చి ఫెన్సింగ్ ను పూర్తిగా తొలగించి స్థలం తమదే నట్టు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తమపై అన్యాయంగా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ స్థలం నిర్మాణం చేపట్టేందుకు గ్రామపంచాయతీ నుండి పూర్తి అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. నిర్మాణానికి గ్రామపంచాయతీకి 28 వేల రూపాయలు ఫీజులు చెల్లించడం జరిగిందని తెలిపారు.ఈ స్థలం విషయంలో తనదేనంటూ కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నందున హైకోర్టు నుండి స్టే తీసుకురావడం కూడా జరిగిందని వివరించారు. ఈ స్థలం విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సంబందిత ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.