హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సీఎంను కోరినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జేపీ మాట్లాడారు. శాసన సభ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని అన్ని పార్టీల నేతలను కోరుతున్నట్లు తెలియజేశారు. అన్ని పార్టీలు చట్టసభల్లో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పోందుకు భయపడుతున్నారని… యువతకు ఉపాధిపై సమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.




