అన్ని రంగాల్లో సూర్యాపేట అభివృద్ధి
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్లా లక్ష్మీకాంత్ అన్నారు.జగదీషన్న కప్ విజేతలకు బహుమతుల ప్రధానంతో పాటు ఆ వార్డులో జగదీషన్న గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.అభివృద్ధి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందుతున్నాయని అన్నారు. సూర్యాపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్స్ , మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి నిర్మాణాల ఘనత మంత్రి జగదీష్ రెడ్డికే దక్కుతుందన్నారు.రానున్న ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని, మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించటం ఖాయమన్నారు.