అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
బీఆర్ఎస్ యూత్ ప్రెసిసెంట్ ఆనంద్ రావు
మునిపల్లి, ఆగస్టు 09, జనంసాక్షి :
అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు అన్నారు. బుధవారం నాడు మండలంలోని తాటిపల్లి గ్రామంలో సీనియర్ నాయకులు అల్లం నావాజ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురుంచి గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలంతా మరోసారి కేసీఆర్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, రవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.