గృహలక్ష్మి దరఖాస్తులకు 15 రోజులు సమయం పొడిగించాలి
కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జిట్టా మల్లారెడ్డి
భువనగిరి టౌన్ ఆగస్టు 9 (జనం సాక్షి ): గృహలక్ష్మి పథకం క్రింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు కేటాయించడం సరైంది కాదని, కనీసం 15 రోజులు దరఖాస్తు చేసుకోవడానికి పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జిట్ట మల్లారెడ్డి అధికారులను కోరారు. దీనితో పాటుగా దరఖాస్తుదారులు కులం, ఆదాయ సర్టిఫికెట్లను, బ్యాంకు ఎకౌంటు కూడా జతపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీనితో నిరుపేదలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ తీసుకోవడం సాధ్యం కాదని కనీసం 15 రోజులు సమయం పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జిట్టా మల్లారెడ్డి భువనగిరి మున్సిపాలిటీ తాసిల్దార్ మండల సమితి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.