అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: రేగా కాంతారావు

 

పేదింటి ఆడపడుచులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మహిళలకు దసరా కానుక చీరల పంపిణీ

దళిత బంధు పథకంతో ఆసరా..

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 23 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 74 లక్షల విలువగల చెక్కులను, అశ్వాపురం మండలంలోని రైతు వేదిక నందు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు రూపాయలు 62 లక్షల విలువగల చెక్కులను అలాగే దసరా పండగ సందర్భంగా బతుకమ్మ చీరలను మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామపంచాయతీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. 86 లక్షల తో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదే మండలంలోని మల్లెల మడుగు గ్రామానికి చెందిన మంగళగిరి రామకృష్ణ మొండికుంట గ్రామంలో దళిత మందు పథకం కింద ఏర్పాటుచేసిన విజ్ఞేశ్వర సూపర్ మార్కెట్ ను రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు అందిస్తున్న పెళ్లి కానుక అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. 2014 ముందు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే పేదవారు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడబిడ్డలకు మేనమామ గా మారి ఒక లక్ష 116 రూపాయలను ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా చెక్కుల రూపంలో నేరుగా అందజేయడం జరుగుతుందన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు,దివ్యాంగులకు నెలకు రూ.3016 వితంతువులు ఇతర కేటగిరీల వారికి రూ. 2016 చొప్పున అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దళిత బంధు పథకం ద్వారా దళితులకు చేయూతనిస్తూ వారిని అన్ని రంగాలలో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. దళిత బంధు పథకం దళితులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు ఐక్యతకు నిదర్శనం గా మారిందని ఆయన పేర్కొన్నారు, ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి పండుగలకు కానుకలు ఇస్తూ గౌరవిస్తున్నారని కొనియాడారు, మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు, మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే నేతన్నల కుటుంబాలకు రెట్టింపు ఆదాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు, రూ.339 కోట్లతో కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు, కావాలనే విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ప్రజలు గమనించాలని కోరారు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంపై ఇక్కడి పరిపాలనపై మాట్లాడే నైతిక హక్కు ఇతర పార్టీలకు లేవని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి సహకరించకపోగా దేశ సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.