అన్ని వర్గాల సంక్షేమ మే ప్రభుత్వ ద్యేయం
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నర్సాపూర్. సెప్టెంబర్, 28 , ( జనం సాక్షి )
అన్ని వర్గాల సంక్షేమ మే ప్రభుత్వ ద్యేయమని
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. అన్ని మతాల పండుగలను గౌరవించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వన్ని ప్రజలు దివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, సరళ ఆంజనేయులు, లలితా బిక్షపతి, నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ ఎన్ ఎస్ పి 1సమావేశంలో మాట్లాడుతూన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి
Attachments area
|