ఆత్మమత్యకు ప్రయత్నించిన మహిళ
ఆగిపోయిన రిజస్టేష్రన్
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి): కుటుంబ సభ్యులు తన వ్యవసాయ భూమిని అక్రమంగా కాజేస్తున్నారని ఓ మహిళ ఆరోపిస్తూ.. శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మహిళ పార్వతమ్మగా గుర్తించారు. పార్వతమ్మ వ్యవసాయ తన వ్యవసాయ భూమికి సంబంధించిన విషయంపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. తన భూమిని వేరొకరి పేరిట రిజిస్టేష్రన్ చేస్తుండగా వద్దని బతిమాలింది. తను ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై.. ఆత్మహత్యకు ప్రయత్నించడంతో స్థానికులు పార్వతమ్మను అడ్డుకున్నారు. పార్వతమ్మ ఆత్మహత్యాయత్నంతో భూమి రిజిస్టేష్రన్ను నిలిపివేశారు.ఉమ్మడిగా వున్న కుటంబసభ్యులు తనకు తెలియకుండా వ్యవసాయ భూమిని కాజేస్తున్నారనే అనుమానంతో పార్వతమ్మ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనతో అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళన చెందారు.




