అపన్న హస్తం కోసం ఎదురుచూపులు

దాతలు ఆదుకోవాలని అభ్యర్ధన
ఫోటోరైటఫ్:అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మచ్చ సతీష్
  పెన్ పహాడ్. ఆగస్టు 24 (జనం సాక్షి) : డెంగ్యూ జ్వరం, కిడ్నీల వ్యాధితో బాధపడుతూ కడు బీదరికంలో చికిత్స పొందుతూ ఆపన్న హస్తం కోసం యువకుడు ఎదురు చూస్తున్న సంఘటన మండల పరిదిలోని అనంతారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మచ్చ సతీష్  గత వారం రోజులు క్రితం  డెంగ్యూ జ్వరం, కామెర్లు
కిడ్నీ, ఊపిరితిత్తుల అనారోగ్య  సమస్యలతో హైద్రాబాద్ లోని మలక్ పేట యశోద హాస్పిటల్ చికిత్స నిమిత్తం చేరగా  ప్రస్తుతం ఎం ఐ సీ యూ  లో ఉన్నాడు కాగా  రోజుకి లక్షయాభైవేయిల రూపాయల(1,50 000) ఖర్చు అవుతున్నాయి ఇప్పటివరకు వారి స్తోమతకు మించి అప్పు చెసి మరీ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టారు ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక  దిక్కుతోచనిస్థితిలో  సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు దానగుణం ఉన్నవారు  దయచేసి వారికి  తోచినంత ఆర్ధిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు తన ప్రాణం దయగల దాతలపై ఆధారపడి ఉందని మనం డాక్టర్లు కాకపోయినా గాని ఆర్ధిక సహాయం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడొచ్చని
ఈ క్రింది ఫోన్పై గూగుల్ పే
9666653758 నెంబర్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు

తాజావార్తలు