ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గంగుల
★ 3 రోజుల పాటు కొనసాగిన వేడుకలు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
పొచమ్మ తల్లి దయవల్ల సర్వజనులు సుఖసంతోషాలతో వర్దిల్లాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
బుధవారం కోతి రాంపూర్ లో నూతనంగా పునర్నిర్మించిన పొచమ్మ తల్లి ఆలయాన్నిదర్శించుకున్నారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
సోమవారం ఉత్సవాలు ప్రారంభం కాగా అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.శ్రావణమాసం ఆఖరి బుధవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళ నడుమ బోనాలతో స్థానిక పోచమ్మ దేవాలయానికి వచ్చి తమ మొక్కులు సమర్పించారు. పోచమ్మ తల్లి మా పిల్లాపాపలతో చల్లగా చూడు అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా వందలాదిగా వచ్చిన భక్తులకు దేవాలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాటు చేశారు.ఆలయానికి విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు మహిళా కళాకారిణి లు డప్పు చప్పుళ్ల తో స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పునఃప్రతిష్ట కార్యక్రమాలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయన్నారు.
ఆలయ పునర్నిర్మాణ పథకం కింద దేవాదాయ ధర్మాదాయ శాఖవారు 36 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేసారని అన్నారు. రాబోయే రోజుల్లో సైతం ఆలయ అభివృద్దికి చర్యలు తీసుకుంటానని మంత్రి. పొచమ్మ తల్లి దయవల్ల సర్వజనులు సుఖసంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు , కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణుగోపాల్ ,ఐలెందర్ యాదవ్,గందే మాధవి ,చల్ల హరిశంకర్, కొల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.