: అపోలో డయాగ్నోస్టిక్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్, కొండా విశ్వజిత్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి ) : దేశవ్యాప్త ఉనికితో ప్రఖ్యాత పాథాలజీ గొలుసుకట్టు సెంటర్లు కలిగి అపోలో డయాగ్నోస్టిక్స్, తన పదిహేను వందల పాథాలజీ సెంటర్‌ను హైదరాబాద్ కొత్తపేట్‌లోని మోహన్ నగర్‌లో ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నోస్టిక్స్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్, విశ్వజిత్ రెడ్డి కొండా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా విశ్వజిత్ రెడ్డి కొండా మాట్లాడుతూ కొత్తగా ప్రారభమైన ఈ సువిశాలమైన పాథాలజీ సెంటర్ 3,000 కంటే ఎక్కువ టెస్టుల సమగ్ర మెనుని అందిస్తుందని , ఇవన్నీ కూడా అత్యంత అనుభవజ్ఞులైన పాథాలజిస్టుల పర్యవేక్షణలో నిర్వహించబడుతాయని తెలిపారు .
అపోలో డయాగ్నోస్టిక్స్‌కు హైదరాబాద్‌లో గ్లోబల్ రిఫరెన్స్ లాబొరేటరీ ఉందనీ , భారతదేశవ్యాప్తంగా 1500 పేషెంట్ కేర్ సెంటర్లు, 120కి పైగా ల్యాబ్‌లు ఉన్నాయని . ఐసిఎమ్ఆర్ , రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు .భారతదేశవ్యాప్తంగా 1500వ సెంటర్‌ను హైదరాబాద్‌లో100వ కేంద్రాన్ని ప్రారంభించడంపై మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు . ఇది నివారణ సంరక్షణ పట్ల మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారి యొక్క దార్శినీకతకు మమ్మల్ని మరింత చేరువ చేస్తుందని అపోలో డయాగ్నోస్టిక్స్ రోగి పరిసరాల్లోనే అందుబాటులో ఉండేలా తన కలెక్షన్ సెంటర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్న మని అన్నారు .అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టయిల్ లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చంద్ర శేఖర్ సి. మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి డయాగ్నొస్టిక్ సేవలను అపోలో డయాగ్నస్టిక్స్ కొత్త ప్రదేశాలలోకి తీసుకువస్తున్నది. కొత్తపేట్‌లోని మోహన్ నగర్ లో ఏర్పాటైన ఈ పదిహేను వందల కేంద్రం, ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు మరియు అపోలో డయాగ్నోస్టిక్స్ సెంటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరిన్ని నూతన ప్రాంతాలకు చేరుకోవడానికి ఇది మాకు ప్రేరణ ఇస్తుంది. ఈ కార్యక్రమంలో అపోలో డయాగ్నోస్టిక్స్, వైస్ ప్రెసిడెంట్, దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ తదితరులు పాల్గొన్నారు




