హైదరాబాద్, మార్చి 20 : అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట అవేరా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నంలో అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించి హతమార్చిన భర్త శ్రీశైలం యాదవ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. శ్రీశైలం యాదవ్ భార్య స్వప్న అవేరా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతుండడంతో సహ విద్యార్థులు ఈ ఆందోళనకు దిగారు. నిందితుడు శ్రీశైలంను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.




