*అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఘన నివాళులు
మెట్పల్లి టౌన్ : జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జగిత్యాల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాణా వేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు ఎఎంసి వైస్ చైర్మన్ పూదారి సుధాకర్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోఆప్షన్ మార్గం గంగాధర్ కౌన్సిలర్స్ టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు