Tuesday, 3 November 2026

అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న జోగు రామన్న

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  భైంసా మండలం ఇలేగాం గ్రామంలో కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు. ఇలేగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో ప్రజల్లో మంచి మార్పు వస్తుందన్నారు. చెడు అలవాట్లను వీడి సన్మార్గంలో నడవాలని కోరారు. ఇలేగాం అభివృద్ధికి కృషి చేస్తానని, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సంప్రదించి కల్యాణ మండపం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన బదింసా ఎంపీపీ కార్యాలయంలో బీడీ కార్మికులకు జీవనభృతి చెల్లింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, తెరాస నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *