అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత – మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో అక్టోబర్ 16 (జనంసాక్షి): సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  ఆదర్శనగర్- సిద్దాపూర్ -కౌట్ల రోడ్డు పనుల నిధుల జీవో విడుదల చేయించినందుకు మంత్రి అల్లోలను ఆదర్శనగర్ కాలనీవాసులు ఆదివారం ఘనంగా సన్మానించారు.గతంలో ఈ రోడ్డు అద్వాన స్థితిలో ఉండడంతో కాలనీవాసులు పలు సామాజిక వేదికల ద్వారా మంత్రి అల్లోల దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన మంత్రి నిధుల విడుదలకు గతంలో కృషి చేశారు. పరిపాలన ,సాంకేతిక ఉత్తర్వులు గతంలో వచ్చినప్పటికీ ఆర్థికపరమైన ఉత్తర్వులు విడుదల కాలేదు .దీంతో మంత్రి చొరవతో 354 జీవో ద్వారా ఆర్థికపరమైన ఉత్తర్వులు వచ్చాయి. వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డుపనులు ప్రారంభించి డబుల్ రోడ్డు వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.    ఈ     కార్యక్రమంలో కామారపు జగదీశ్వర్, రాజేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, సునీల్, ఉమేష్ ,శ్రీనివాస్ ,భీమ్రావు, కామారపు భారతి, నలినిరెడ్డి, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
Attachments area