హైదరాబాద్ : సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట అని అభివర్ణించారు. నీటి పారుదల, విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం దూసుకపోతోందన్నారు. వచ్చే మార్చి నుండి వ్యవసాయానికి ఉదయం పూట 9గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రూ.480 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందని, మైక్రో ఇరిగేషన్ కు రూ.402 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నో వ్యవప్రయాసలు పడి విద్యుత్ సమస్య నుండి గట్టెక్కినట్లు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. పరిశ్రమల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమైన సింగిల్ విండో విధానం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ 100 కి.మీ. గ్రీన్ హౌస్ కల్టివేషన్ లు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.




