Wednesday, 4 November 2026

అభివృద్ధి దిశగా ముందుకు..

కలెక్టరేట్‌లో బాధ్యతల స్వీకరణ
హన్మకొండ అర్బన్ : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తానని కలెక్టర్ కరుణ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆమె కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రజలకు అందేలా తన వంతు పాటుపడతానన్నారు.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కరుణకు జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  కలెక్టర్‌కు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ ఉషారాణి, తహసీల్దార్ల సంఘం జిల్లా నాయకులు, డీఆర్‌డీఏ పీడీ రాము, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.

అధికారులను కలెక్టర్ కరుణ పేరుపేరునా పలకరించారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నవంటూ తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆమె తల్లి ప్రమీల. అక్కయ్యలు అప్రాచిత, శిరీష, తమ్ము డు  ఛైతన్య ఉన్నారు. కాగా,  ఐకేపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2015 క్యాలెండర్‌ను కలెక్టర్ కరుణ ఆవిష్కరించారు. నాయకులు అనిల్, రవి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆర్డీఓలు వెంకటమాధవరావు, మహేందర్‌జీ, వెంకట్‌రెడ్డి , భాస్కర్‌రావు, డీఈఓ చంద్రమోహన్, ఆర్వీఎం అధికారులు, వీఆర్వోల సంక్షేమ సంఘం నాయకులు విజయరామారావు, హేమానాయక్, సింగ్‌లాల్, జంపయ్య, రవీందర్, ట్రెస్సా నాయకులు సత్యనారాయణ, విశ్వనారాయణ, రాజ్‌కుమార్, శ్రీకాంత్ తదతరులు ఉన్నారు. ఇదిలా ఉండగా,  రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కలెక్టరేట్‌లో బాద్యతలు స్వీకరించిన కరుణను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీపీఎం నాయకులు నాగయ్య, శ్రీనివాస్, దళిత రత్న బొమ్మల కట్టయ్య, ఎన్జీఓ నాయకులు, అధికారులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

కలెక్టర్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ శుభాకాంక్షలు
హన్మకొండ : కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వాకాటి కరుణను జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు కలిశారు. కలెక్టరేట్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *