అభివృద్ధి సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం

బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్
-సర్పంచ్ శరత్ నాయక్

కురవి అక్టోబర్-7 (జనం సాక్షి న్యూస్)

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని నిరంతరాయంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న నేత అని కురవి మండలం బంచరాయితండ గ్రామ సర్పంచ్ శరత్ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శరత్ నాయక్ మాట్లాడుతూ బంచరాయితండ గ్రామపంచాయతీలో 26 మందికి కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిచారని సర్పంచ్ శరత్ నాయక్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు బిజెపి పాలిత రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై వివక్ష చూపిన కేసీఆర్ పెద్ద మనసుతో రైతు సమగ్రాభివృద్ధికి పాటు పడుతున్నట్లు తెలిపారు.రైతుబంధు మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు కొత్తగా లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకంలో భాగంగా ఇలాంటి భేదాలు లేకుండా ఆడపడుచుల వివాహానికి రూ. లక్షా నూటపదహార్లు అందిస్తున్న ఘనత కేసీఆర్ దే అన్నారు.
ఈ కార్యక్రమంలో వీర్య, మోతిలాల్, పింఛన్ లబ్ధిదారులు బీమా,లావు,మంగ్య, హప్ల,సుక్య,బాల్ సింగ్,కుమారి,చిన్ని, వీరి,బుజ్జి,బీమా, రాజా,తదితరులు పాల్గొన్నారు.