*అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం
లింగంపేట్ 25 సెప్టెంబర్ (జనంసాక్షి)
లింగంపేట్ మండలం బాయంపల్లి తండాలో ఉన్న అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వృద్ధాశ్రమం నిర్వాహకుడు మాలోత్ రవి తెలిపారు. ఆదివారం మండలంలోని బోనాల్,కోర్పోల్,బాణాపూర్,బాణా పూర్ తాండ, బాయంపల్లి,బాయంపల్లి తండా,ప్రజలకు వైద్యుడు వెంకట్ జమున రాథోడ్ వైద్యం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.110 మంది ప్రజలకు వైద్యం పరిక్షలు నిర్వహించగా 40 మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించి ఉచిత మందులు పంపిణి చేసామన్నారు.మిగతా వారికి బ్లడ్ టెస్ట్ నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశామన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాండాల్లో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలందరికి వైద్య సేవలు అందిస్తామన్నారు.అమూల్య వృద్దాశ్రమం తరపున డాక్టర్ వెంకట్ జమునలకు శాలువ కప్పి సన్మానించడం జరిగిందన్నారు.