అమ్మనబోలు మండల ఏర్పాటుకు కృషి చేస్తాను

జడ్పీ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి
నార్కెట్‌పల్లి సెప్టెంబర్ 28 జనంసాక్షి : అమ్మనబోలు మండల సాధన కమిటీ ఆద్వర్యంలో 67 రోజులుగా నిరవధికంగా పోరాడుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి సభా వేదికకు హాజరైనారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మెన్ మాట్లాడుతూ అమ్మనబోలును మండలం చేయాలని శాంతియుతంగా పోరాడుతున్న వారికి నా సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా వుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్నొ కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనా సౌలభ్యం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కొత్త మండలంగా ఏర్పాటుకు జనాభా, భౌగోళిక పరిస్థితులు,భూ విస్తీర్ణం తదితర అంశాలు అన్ని అమ్మనబోలుకు ఉన్నాయని, ఈ విషయాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ ల దృష్టికి నాతో పాటు, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పలుమార్లు తీసుకెళ్ళామని వారు కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. అమ్మనబోలు మండల ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ను తీర్చుటకు ప్రయత్న లోపం లేకుండ కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బద్దం వరమ్మ రాంరెడ్డి,ఎంపీటీసీ కొంపల్లి సైదులు,ఉప సర్పంచ్ జాన్ రెడ్డి ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్తయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము గిరి,పజ్జూరి నర్సిరెడ్డి,వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area