ఆలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్
ఎల్బీ నగర్( జననం సాక్షి ) అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ చైర్మన్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . హస్తినాపురం భూపేష్ గుప్తా నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్ శాస్త్రి మరియు అనిల్ శాస్త్రి చే ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్, నరసింహ, సాయి యాదవ్, రాజు మరికొంద మంది భక్తులు పాల్గొన్నారు.





