జూరాల ప్రాజెక్టుకు భారీ వరద…

– ఈయనది రెండోసారి కృష్ణమ్మకు వరద
– 14 గేట్లు తెరిచి 90 వేల క్యూసెక్కుల వరద నీళ్లు విడుదల

గద్వాలోని జూరాల జలాశయానికి జలకళ సంతరించింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టులోకి లక్షకు పైగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు 14 గేట్లు తెరిచి దిగువకు 90 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదిలో రెండోసారి జూరాల డ్యాం పూర్తిగా నిండింది. దీంతో అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు