అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి;కే ఎల్ ఎన్ ప్రసాద్
కోదాడ టౌన్ అక్టోబర్ 02 ( జనంసాక్షి )
దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది కే ఎల్ ఎన్ ప్రసాద్ అన్నారు.ఆదివారం పట్టణంలోని 30 వ వార్డులో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.గణేష్ చవితి దుర్గామాత ఉత్సవాలకు ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.కోదాడ పట్టణ ప్రజలు ఎల్లవేళలా దుర్గామాత ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. అన్నదానం పుణ్యకార్యమని అన్నదానం నిర్వహించిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్,ఓయు జెఎసి నాయకులు కందుల మధు, కట్టే బోయిన శ్రీనివాస్ యాదవ్, నిర్వాహకులు బాలె బోయిన శ్రీనివాస్,సత్తార్,ఆలవెల్లి నర్సి, చలిగంటి ప్రసాద్, కొలిపాక రాజేష్,సుంకు శీను,శ్రీకాంత్, టీచర్, రాంబాబు,శివా,రంగ,ఉప్పి,మనోజ్, మధు,తదితరులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.అర్చకులు నాగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో కేఎల్ ఎన్ కు యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.