ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ మరియు ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేడు ఆదివారం రోజున అక్టోబర్ 2న గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి,అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మి అంటరానితనం,కుల,మత వివక్ష లేని సమ సమాజ స్థాపనకు కృషి చేసిన ఘనత మన గాంధీకే దక్కుతుందన్నారు.ఆయనడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు,చిన్న అడిసర్ల పల్లి ఉప సర్పంచ్ మూడావత్ మంగ్యా నాయక్,పొట్ట బత్తిని లక్ష్మి నారాయణ,చేపూరి కార్తీక్,పెద్దిశెట్టి మహేందర్,విద్యార్థి విభాగం నాయకులు యం.డి ఖధీర్, రామావత్ సేవా నాయక్,నాగేంద్ర,అనిల్, శివ,తదితరులు పాల్గొన్నారు.