Tuesday, 3 November 2026

అమ్రాబాద్‌ సీఐపై కేసు నమోదు

నల్గోండ : నేర విభాగం ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినివి నమ్మించి తల్లిని చేసిన సీఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం మహబుబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐగా పనిచేస్తున్న పాండురంగారెడ్డి గతేడాది నల్గోండ రూరల్‌ పోలీసు స్టేషన్‌ లో సీఐగా పనిచేస్తున్నప్పుడు ఇదే స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ గా ఉన్న ఒక మహిళను నమ్మించి గర్బవతిగా చేశాడు. రెండుసార్లు అబర్షన్‌ కూడా చేయించాడు. మూడోసారి బాబు పుడితే మాయం చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే సీఐ తన కుటుంబ సభ్యులతో కోటించాడని బాధిత మహిళా కానిస్టేబుల్‌  ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసింది.వారు పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును అశ్రయించింది. కోర్టు అదేశాల మేరకు సీఐ పాండురంగారెడ్డి అయన సోదరుడుసత్యనారాయణరెడ్డిపై మోసం, అత్యాచారం, అట్రాసీటి కేసులు నమోదు చేసినట్లు నల్గోండ ఒకటవ పట్టణ పెలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *