అమ్రాబాద్ మండల నూతన అంబెడ్కర్ సంఘం అడ్ హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్ 08, (జనంసాక్షి న్యూస్): నియోజకవర్గంలో ని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా అంబెడ్కర్ జల్లా నాయకులు జక్క బాలకిష్టయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ వాదులు మరియు అంబెడ్కర్ అభిమానుల మధ్య నూతన మండల యువజన అంబెడ్కర్ సంఘం ఏర్పాటు లో భాగంగా అమ్రాబాద్ మండల అంబెడ్కర్ అడ్ హాక్ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి దళిత బహుజన మేధావులు అంబేద్కర్ ఆశయాలపై, భవిష్యత్తు కార్యాచరణ పై, రాజ్యాంగ పరిరక్షణపై అంబేద్కర్ యువజన సంఘాల పనితీరుపై అనుసరించాల్సిన వ్యూహాల పైన ప్రసంగించడంతోపాటు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన అమ్రాబాద్ మండల అంబెడ్కర్ అడ్ హాక్ కమిటీ సమన్వయకర్తలుగా గంటల మోహన్ ,ధూమర్ల ఎల్ల స్వామి ,ఏకలవ్య ,చెట్టుకింది మల్లయ్య ,సామా అనిల్ నోముల రాజు ,మద్దేల శివకృష్ణ ,బుడిగెముల్ల మురళి మంతటి పాండు బియ్యం పవన్ ,జక్క నగేష్ ,సామ శ్రీనివాసులు ,ఎన్నిక కాగా గౌరవ సలహాదారులుగా కలుముల నాసరయ్య ,జక్క బాలకృష్ణయ్య ,సౌట కాశీం, కుంద మల్లికార్జున్ ,పురం పవన్ కుమార్ ,సామ సాయిలు, చెట్టుకింద నాసర్,గెంటెల బృందావన్, కుంద చెన్నకేశవులు ,గాజుల వెంకటేష్ ,మంతటి రామాంజనేయులు,మరియు అంబెడ్కర్ వాదులు అభిమానులు పాల్గొన్నారు.