అయిజ అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాలు

అయిజ,జులై 23 (జనం సాక్షి):
 అయిజ  మున్సిపల్ నందు అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాలు నిర్వహించారు.ఈ బోనాల సంబరాలు విద్యార్థులు వేషధారణలతో,పోతురాజులుగా మారి బోనం సమర్పించి ఎంతో సంతోషంగా బోనాలు జరుపుకున్నారు.కార్యక్రమం పాఠశాల యాజమాన్యం నిర్వహించారు.అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.
ముందుగా విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు బోనాలు శుభాకాంక్షలు
మన పట్టణంలో ఏ స్కూల్ చేయని విధంగా మన పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించాం. ముందు ముందుగా  ఇలాంటి సంబరాలు ఎన్నెన్నో నిర్వహిస్తామని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యు మహేందర్,హెచ్ఎం వెంకటేష్,ప్రతాప్,మాధవి మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area