అరటి సాగు లాభదాయకం

– కోదాడ డివిజన్ ఇన్చార్జి ఉద్యానవనాధికారి కన్న జగన్

 

మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): అరటి సాగు అన్ని విధాలుగా లాభదాయకం మరియు అనుకూలమని కోదాడ డివిజన్ ఇన్చార్జి ఉద్యానవనాధికారి కన్న జగన్ అన్నారు. మండలంలోని రేపాల గ్రామంలో పందిరి పుల్లారెడ్డి వ్యవసాయ భూమిలో దాదాపు పది ఎకరాల్లో విష్ యు కల్చర్ అరటిని సాగు చేయడం జరిగిందని, మన జిల్లాలో పెరిగిన నీటి వసతి అనుకూలమైన వాతావరణం మంచి ఎర్రగారప నేలలు ఉండడం వలన అరటి సాగును ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తుందని తెలిపారు. అరటిని ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటగా వేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడానికి సంవత్సరం పొడవున అరటిపంట వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఒక ఎకరం అరటి సాగు చేస్తే దాదాపు 25 నుండి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, ఒకటన్ను దొర పదివేల రూపాయల నుండి 15వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ప్రధాన పండగ అరటిని సాగు చేసే రైతులకు ఒక హెక్టారుకు 41 వేల రూపాయల రాయితీని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మన జిల్లాలో అధికంగా అరటిపంటను సాగు చేయాలనే దృక్పథంతో ఉద్యానవన శాఖ రైతులకు అనేకమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్ మల్లేష్, రైతులు అందరి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.