అర్షులైన ప్రతి దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి )అర్షులైన ప్రతి దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి సొంత స్థంలం ఉన్న వారికి అర్థిక సహాయం అందించాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు వసీమా డిమాండ్ చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. దివ్యాంగులకు దళిత బంధు ఇవ్వాలని, దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రతీ నెల 5 నుంచి 10వ తేది లోపు పింఛన్లు పంపిణీ చేయాలని ప్రతి నెల ఆలస్యం కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అన్నారు, దివ్యాంగులు ఉపకరణాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసిన వారికి ఉపకరణాలు విడుదల చేసి అర్షులైన ప్రతి దివ్యాంగులకు ఈ నెల కొత్త పింఛన్లు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.