Wednesday, 4 November 2026

అర్హులందరికీ ఆసరా పించన్లు ; ఉప సభాపతి తీగుల్ల పద్మారావు

   సికింద్రాబాద్ (జనం సాక్షి ) :     సికింద్రాబాద్ పరిధిలో అర్హులైన వారికి ఆసరా పించన్లు అందించేందుకు ఏర్పాట్లు జరుపుతామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మెట్టుగుడా డివిజన్ కు సంబంధించిన ఆసరా  పెంచనుదరుల గుర్తింపు కార్డులను  పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో అందించారు. కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునిత , అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాగా  సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో  తార్నాక, సితాఫలమండీ డివిజన్లకు సంబంధించిన ఆసరా పించన్ల కార్డుల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఈ శిబిరాన్ని ఉప సభాపతి  పద్మారావు గౌడ్ ప్రారంభించారు.  అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాల ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల జారీ శిబిరాన్ని బుధవారం అడ్డగుట్ట బోయబస్తీ లోని కమ్యూనిటీ హాల్ నిర్వహిస్తారు.  డిప్యూటీ స్పీకర్  పద్మారావు ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారని, కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తాసిల్దార్ శ్రీమతి మాధవి తదితరులు పాల్గొంటారు.