అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదు
కాంగ్రెస్ మండల అధ్యక్షులు . వంచ
బచ్చన్నపేట సెప్టెంబర్ 12 (జనం సాక్షి) ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు వంచా వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ప్రభుత్వము 57 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకున్న వారికే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఇప్పుడు సైట్ ను క్లోజ్ చేయడం వల్ల మ్యానువల్ అప్లై చేసుకున్న వాళ్ళకి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసుకొని మిగతా ఫైల్ ను వెనక్కి పంపడం దారుణమని. ఇలాంటి దొంగ మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయవద్దన్నారు. 57 సంవత్సరాల పెన్షన్ దారుల దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.