17న జనగామలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం

బచ్చన్నపేట సెప్టెంబర్ 12 (జనం సాక్షి) ఈనెల 17న జనగామలో జరగబోయే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాపిరెడ్డి అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో పాటు తమ్మడపల్లి చిన్నరామచర్ల. పోచన్నపేట. గ్రామాలలో అమరవీరులను స్మరించుకుంటూ జీపు జాత నిర్వహించిన అనంతరం. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ లు మాట్లాడుతూ. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ అరాచక పాలనకు వ్యతిరేకంగా దోపిడి వెట్టి చాకిరికి విముక్తి కలిగించాలని ఆనాడు కమ్యూనిస్టులు నిరోచిత పోరాటాలు నడిపారన్నారు. ఆ పోరాటాలలో 4 వేలమంది ప్రాణాలు కోల్పోగా పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టు లదని అన్నారు. అలాంటి మహత్తర పోరాట అమరవీరుల సంస్కరణ సభ జనగామలోని ప్రిస్తియన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ఆల్ ఇండియా సిపిఎం కార్యదర్శి సీతారం ఏచూరి వస్తున్నాడని కావున ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని వాడుకోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజయేందర్. మండల నాయకులు రావుల రవీందర్ రెడ్డి. రామగల అశోక్. మహంకాళి జనార్ధన్. దూడల వెంకటయ్య. ఇంజ ఎల్లయ్య. కంత్రి ఐలయ్య. బురి సుధాకర్. ఎర్ర కనకయ్య. పెంటయ్య లింగయ్య. ప్రజానాట్యమండలి కళాకారులు కళ్లెం శైలజ. సూరి. శివ పాల్గొన్నారు