Monday, 2 November 2026

*అలంపూర్ లో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం*

   *అలంపూర్ జనంసాక్షి* *(అక్టోబర్ 11)*  అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని అలంపూర్ పట్టణం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా కమిటి నాయకులు పెద బాబు మాట్లాడుతూ ఇతర బాలికలలో మన అక్క, చెల్లమ్మ, లను చేసుకోని  నడవాలి అన్నారు. ఈ ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు.అలాగే రాబోవు రోజులలో ప్రభుత్వాలు మహిళలకు, అన్ని రంగాలలో పురుషులతో పాటుగా సమాన అవకాశాలు కలించాలని కోరారు.అంతే కాకుండా బయట సమాజంలో మహిళల పట్ల, పురుషులు అభద్రతా భావానికి గురి చేయకుండా, మంచి ఆరోగ్యకర మైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షకీల్, మహబూబ్, తిరుపాల్,మొహమ్మద్, దుద్ పీర,ఆజయ్, కె నవీన్, మధు తదితరుల పాల్గోన్నారు.
Attachments area