అష్ట దిగ్బంధనంలో తహసిల్దార్ కార్యాలయం
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 10
గాంధారి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి వీఆర్ఏలు తాళం వేసి నిరసన తెలిపారు నేటికీ 78 వ రోజు కావడంతో కార్యాలయానికి వచ్చిన అధికారులను కూడా అడ్డుకున్నారు తరతరాలుగా తాము రెవిన్యూ డిపార్ట్మెంట్లో ఉండి తరతరాలుగా సేవ చేసిన తమకు సానుకూల దృక్పథంతో జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ సుమారు మూడు నెలలుగా వేతనాలు లేక తాము చేస్తున్న సమ్మె కారణంగా కడుపు మార్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పే స్కేల్ సహాయం ఇతర డిమాండ్లపై జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23,000 మంది వీఆర్ఏలు సమ్మె చేస్తున్నామని ఇప్పటికైనా గుర్తించి తమపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు లేని పక్షంలో తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు కార్యక్రమంలో గాంధారి మండల అధ్యక్షులు మూతి భూమయ్య, ప్రధాన కార్యదర్శి గైన సాయిలు, కోశాధికారి సర్దార్, ఎల్లారెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు సురేష్, గాంధారి మండల ఉపాధ్యక్షులు గంగయ్య, వీఆర్ఏలు సంగమేష్ తదితరులు పాల్గొన్నారు