* అసాంఘీక శక్తులకు ప్రజలు సహకరించొద్దు.

*సీఐ వెంకట్ గౌడ్.
చిట్యాల సెప్టెంబర్ 25(జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని  సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ నిషేధిత అసాంఘిక శక్తులైన మావోయిస్టులకు చిట్యాల మండల గ్రామాలలోని ప్రజలెవరూ సహకరించొద్దు. అపరిచిత వ్యక్తులు గ్రామాలలో సంచరిస్తే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని యువత పెడదారి పట్టకుండా ఉన్నత చదువులు చదివి గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే మావోయిస్టు పార్టీకి గతంలో ఆకర్షితులై సానుభూతిపరులుగా ఉన్న  వ్యక్తులు ఎవరైనా  మావోయిస్టు పార్టీకి సహకరిస్తే  కఠినమైన చర్యలకు పాల్పడతారని, అలాంటి వ్యక్తులకు చట్టం పరిధిలో శిక్ష తప్పదనిసీఐ చిట్యాలపులి వెంకట్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.