Monday, 2 November 2026

అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

ఆదిలాబాద్: అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌కు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. గోపాల్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *