అసెంబ్లీలో పలు అంశాలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే చల్లా

 

హన్మకొండ ప్రతినిది/పరకాల ఆగస్టు 5 జనంసాక్షి

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడోరోజైన నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు.గ్రామాలలో VOAలు ఎంతో కృషిచేస్తున్నారు వారి గౌరవ వేతనం రూ.10000/- ఇవ్వాలని,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసినట్లుగానే
ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న హోంగార్డులు, సెకండ్ ఏఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని ప్రస్తావించడం జరిగింది.అలాగే గ్రామాలలో ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందని వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంబంధిత మంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

తాజావార్తలు