అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం .
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– యాదాద్రి భువనగిరి జిల్లాలోన వివర్ సేల్ జిల్లా అధ్యక్షులు నేతం గుర్రం శీను విలేకరులతో మాట్లాడుతూభువనగిరి నియోజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిష్టానం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు . ఇప్పుడున్న బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అప్పుల పాలు అయిందని అన్నారు.ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిక ఇలాంటి పద్మశాలి కులస్తులకు పవర్లూమ్ కార్మికులకు వివిధ సంస్థల పద్మశాలి కులస్తులకుమన పద్మశాలీలకు వృద్ధప్యాయ పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందని అన్నారు. అన్ని కులాల మతాలకు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని తెలిపారు. పద్మశాలిలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమని అన్నారు. రాష్ట్రస్థాయిలో పద్మశాలీలకు గుర్తింపు రావాలంటే పద్మశాలీలు ఏకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూకాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తూమనము బలంగా బలగంలా ఉండాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు బోనగిరి రెండు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.